Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్క స్వైరవిహారం కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కుక్క కరవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో పిచ్చి కుక్క కరిచింది దీంతో జాతరకు వచ్చే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిని గాయపరిచింది. ఆమెను హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అరగంట తర్వాత వైద్యులు యాంటి రేబిస్ వ్యాక్సిన్ సమకూర్చారు. కుక్క స్వైరవిహారం చేయడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బారినుండి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. గాయంతో ఆసుపత్రికి వస్తే.. యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
- సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కరిచిన కుక్క..
- జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో కర్చిన పిచ్చి కుక్క..
- ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిపై కరిచిన కుక్క..
- హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు..
- ఒకే సారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో అందుబాటులోలేని యాంటి రేబిస్ వ్యాక్సిన్..