NTV Telugu Site icon

Rajagopal Reddy: ఆ ప్రచారాలు నమ్మొద్దు.. పార్టీ మార్పుపై రాజగోపాల్ క్లారిటీ

Rajagopal Reddy

Rajagopal Reddy

Rajagopal Reddy Gives Clarity On Party Change: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను, ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పార్టీ మారుతున్నట్టు తనపై ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ మార్పుపై తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే, తామే స్వయంగా మీడియాకి చెప్తాం కదా! అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం బతకాలంటే, అది ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ పార్టీలోకి చేరానని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతి బయటపడాలన్నా, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు బాగు పడాలన్నా.. అది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని అన్నారు.

Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల

అలాగే.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసినప్పుడు, తాను తన అభిప్రాయాలను తెలుపుతానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేని చెప్పారు. కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అయితే కవిత అరెస్ట్, ఈడీ కేసుల వ్యవహారంలో నాన్చుడు జరుగుతుండటంతో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్‌స్టాండింగ్ ఉందని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. ఈ విషయంపై కూడా తాను అధిష్టానంతో మాట్లాడుతానన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే కేటీఆర్‌‌కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని వెల్లడించారు. కేటీఆర్, కేంద్రమంత్రుల భేటీని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. కాగా.. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఈటల రాజేందర్‌తో కలిసి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయల్దేరిన విషయం తెలిసిందే.

Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!