Site icon NTV Telugu

చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు : రాజాసింగ్ సంచలనం

బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా నెంబర్ల నుంచే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్న ఆయన… లేపేస్తం… చంపేస్తాం.. బాంబ్ పెడతామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్స్ ను పట్టుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి సోషల్ మీడియాలో, మీడియా లో ప్రమోట్ చేసుకుంటారని… మరి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కు సంబంధించిన నెంబర్లతో సహా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశా… మరి ఇప్పుడు డీజీపీ ఏం చేస్తారో చూడాలని చురకలు అంటించారు. గతంలో కూడా దేశ విదేశాల నుంచి పాకిస్తాన్ , దుబాయ్, ఇదే మాదిరిగా బెదిరింపు కాల్స్ వస్తే డిజిపికి ఫిర్యాదు చేశాను అప్పుడు పట్టించుకోలేదని… తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినా డిజిపి ఇవ్వడంలేదని మండిపడ్డారు.
దేశ ద్రోహి అక్బరుద్దీన్ పై ఎన్ని కేసులు ఉన్నా…అతనికి డీజీపీ గన్ లైసెన్స్ ఇచ్చారని మండిపడ్డారు. MIM కు భయపడే డీజీపీ…తనకు గన్ లైసెన్స్ ఇవ్వడంలేదని ఆరోపించారు.

Exit mobile version