Rain Alert: తెలంగాణకు వర్ష సూచన, నేడు, రేపు భారీ వర్షాలు

Rains

Rains

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.. నైరుతి రుతుపవాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత 24 గంటల్లో కరీంనగర్‌ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురవగా.. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. హైదరాబాద్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. బుధవారం, గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, ఇవాళ హైదరాబాద్‌తో పాట మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.