NTV Telugu Site icon

Telangana Rains: చల్లని కబురు.. రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: మండుటెండల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వెల్లడించింది. తెలంగాణకు రేపు భారీ వర్ష సూచన ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ వుందని తెలిపింది. రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది. వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.

Read also: Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..

క్యూమలోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని, తెలంగాణలోని దక్షిణ, ఈశాన్య జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. రేపటి నుండి టెంపరేచర్స్ కాస్త తగ్గనున్నట్లు ప్రకటించింది. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ ఐఎండీ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్న (ఆదివారం) ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసాయి. కొన్ని చోట్ల గాలి వేగంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

Read also: CM YS Jagan: సీఎం జగన్‌ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం

ఇవాళ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది. రేపు (మంగళవారం) సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
CM YS Jagan: సీఎం జగన్‌ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం