Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు.. మరో రెండు రోజుల పాటు వానలు

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో చిరు జల్లులు కురుస్తాయని చెప్పారు. ఆకాశం మేఘావృతమై ఉంది.

Read also: Warangal: దగ్గరపడుతున్న పెళ్లి ముహుర్తం.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. శని, ఆదివారాల్లో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు నీటమునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో వర్షాలు కురవలేదని ఆందోళన చెందితే.. ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి.

Read also: Home guard Ravinder: హోంగార్డు రవీందర్ మృతి.. కంచన్‌బాగ్‌లో ఉద్రిక్తత..

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికి పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. కాలు తీసి బయట పెట్టడానికి వీలు లేకుండా పోయింది.. తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వికారాబాద్, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్‌లో చుట్టు పక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్ సాగర్‌ జలయాశాలు వరద నీటితో నిండిపోయాయి.. డ్యామ్ లలో నీటిని వదులుతున్నారు.. ఇక మరోసారి భారీ వర్షాలంటే జనం భయపడుతున్నారు.. ఏది ఏమైనా వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
LED Light Dress: మూములు క్రియేటివిటీ కాదుగా.. వధువు డ్రెస్ చూసి అందరూ షాక్

Exit mobile version