TS Rain: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు (5న) నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి. మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 6వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Read also: Viral: భార్య ఎక్కిన విమానం రావడం ఆలస్యం.. వారందరికి షాక్ ఇచ్చిన భర్త
ఎల్లుండి (7వ) తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 8వ తేదీన కూడా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో వర్షాలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి. గత నెల కంటే ఈ నెలలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 82.2, వికారాబాద్ పరిధిలోని తాండూరులో 65.8, కొడంగల్‌లో 62.6, నారాయణపేట పరిధిలోని కోస్గిలో 56.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Viral: భార్య ఎక్కిన విమానం రావడం ఆలస్యం.. వారందరికి షాక్ ఇచ్చిన భర్త