NTV Telugu Site icon

Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు.. హైదరాబాద్‌కు సూచన లేదా..!

Weather Update

Weather Update

Rains in Telangana: మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ చిలిపిగా పలకరించింది. తెలంగాణలో నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వివిధ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురిసినా.. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ లో మాత్రం వాతావరణంలో మార్పులు ఉండవని తెలుస్తోంది. ఎప్పటిలాగానే ఎండలు మాత్రం కొనసాగుతాయి. ఇక 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

Read also: Congress Janajatara: నేడు కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

ఇక ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో 43 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో శనివారం వడగళ్ల వాన కురుస్తుంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో ఆదివారం ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.
Prasanth Varma : జై హనుమాన్ అన్నారు కద సార్.. ఇదేంటి ఇప్పుడు?