Site icon NTV Telugu

Telangana Rains: రాష్ట్రంలో భిన్న వాతావరణం.. 19 జిల్లాల్లో వానలకు ఛాన్స్‌

Telangana Rains

Telangana Rains

Telangana Rains: అధిక ఉష్ణోగ్రతలు, వర్షంతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 19 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (ప్రతి గంటలకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో) నేడు, రేపు, ఎల్లుండి (మంగళ, బుధ, గురు) రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Read also: Pomegranate Leaves: దానిమ్మ ఆకులను ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు దూరం..

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. . పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Read also: 30 Years Prudhvi: పావలా కాదు యాంకర్ శ్యామల… చెప్పులు, చీపుళ్ళతో కొడతామంటూన్నారు!

మెదక్, సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రామాయంపేట, నార్సింగి, శివునూరు, కుకునూర్ పల్లి, గజ్వేల్, కొండపాకలో తేలికపాటి వర్షం కురుస్తుంది. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. అకాల వర్షం వల్ల వరి, మామిడి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలికి రాలిపోయిన మామిడి కాయలు, వరి పొలాలు నేల కొరికేస్తున్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణం చల్లబడింది. హన్మకొండ జిల్లాలో వాతావరణం మేఘావృతమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. మరికొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం కురిసింది.
PM Modi: అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

Exit mobile version