Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్‌పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- వేలంలో రికార్డు ధర పలికిన ప్లాట్
- 5.25 ఎకరాలకు రూ.1,386 కోట్ల విలువ
- MSN రియాల్టీస్కు దక్కిన స్థలం
- హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raidurg Land: తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డులు తిరగరాసింది. నగరంలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం పరిధిలోని ప్లాట్ నంబర్ P1కి సంబంధించి నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ. 264 కోట్ల రికార్డు ధర పలికింది. ప్లాట్ విస్తీర్ణం మొత్తం 5.25 ఎకరాలు ఉండగా, ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం మొత్తం విలువ రూ. 1,386 కోట్లకు చేరింది.
వేలం చేజిక్కించుకున్న MSN రియాల్టీస్
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘MSN రియాల్టీస్’ పోటీపడి దక్కించుకుంది. ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఈ వేలం ప్రక్రియ అధికారికంగా ముగిసింది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న డిమాండ్‌తో పాటు ఐటీ కారిడార్ విస్తరణ, మౌలిక వసతుల పెంపు కారణాల వల్లే రాయదుర్గం భూములకు ఈ స్థాయిలో అనూహ్య ధర లభించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!