Site icon NTV Telugu

Rahul Gandhi : తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్..

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్‌ గాంధీ చేరుకుంటారు. 5:10కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.. 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు.. 8 గంటలకు వరంగల్ నుండి బై రోడ్ ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు.. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు.

రేపు మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు.. 12:50-1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.. 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు.. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో మీటింగ్ లో పాల్గొంటారు. 1:45నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు.. 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంటారు. 5:50కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి వెళ్తారు.

Exit mobile version