కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తోన్న రాహుల్ గాంధీ.. ప్రస్తుతం తెలంగాణలో తన యాత్ర కొనసాగిస్తున్నారు.. పార్టీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీకి అనేక అంశాలపై స్పందించారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. టీఆర్ఎస్‌తో పొత్తు లాంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీపై హాట్ కామెంట్లు చేశారు రాహుల్.. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్.. అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకొవచ్చని.. కానీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. అది కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపించబోదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
Read Also: NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు
అంతేకాదు, టీఆర్ఎస్ విధానాలకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు రాహుల్.. టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు.. టీఆర్ఎస్‌తో పొత్తు వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.. రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్తామన్న రాహుల్.. టీఆర్ఎస్ పార్టీ తో భవిష్యత్ లోనూ ఎలాంటి పొత్తు ప్రసక్తే ఉండబోదని కుండబద్దలు కొట్టారు.. ఇక, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆరోపించిన ఆయన.. అవినీతికి పాల్పడే వారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదన్నారు.. కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుందని.. ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ మిత్ర పక్షాలతో కేసీఆర్ మాట్లాడడంపై కూడా స్పందించారు రాహుల్.. కేసీఆర్ నితీష్ కుమార్‌తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చు.. తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ఇక, విద్వేష రాజకీయాలు దేశానికి హానికరం అన్నారు రాహుల్.. నరేంద్ర మోడీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.. ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన సంస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారన్నారు. విద్వేష రాజకీయాలపైనే భారత్ జోడో యాత్ర సాగుతోంది.. లక్షల మంది నాతో నడుస్తున్నారని.. ఈ యాత్రలో తాను ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు.. మరోవైపు, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అన్నింటిపై చర్చ చేస్తారన్న ఆయన.. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి..? దాని మీద చర్చ చేయాలని సూచించారు. రెండూ పార్టీలు దోచుకుని పనిలో ఉన్నాయంటూ బీఆర్ఎస్, టీఆర్ఎస్‌పై మండిపడ్డారు రాహుల్ గాంధీ.