Site icon NTV Telugu

Rahul Gandhi Sabha: వరంగల్‌ సభకు బయల్దేరిన రాహుల్

Rahulss

Rahulss

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు.

రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనుంది. అక్కడి మైదానం ఫ్లెక్సీలు, కాంగ్రెస్‌ జెండాలతో ముస్తాబు అయింది. రాహుల్ పర్యటన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాన వేదికకు ఒకవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబసభ్యుల కోసం ఓ వేదిక, మరోవైపు కళాకారుల కోసం మరో వేదిక ఏర్పాటు చేసారు. వీఐపీల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.

వరంగల్ ఆర్ట్స్ అండ్స్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న రాహుల్ సభ కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్ళాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సిటీకి ఐదు కిలో మీటర్ల దూరం లోనే నేతల వాహనాలు ఆపేయడం తో పెద్ద నేతలు కూడా స్వంత వాహనాలు పక్కన పెట్టి ట్రాలీ ఆటో లో వెళుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సామాన్య కార్యకర్తలతో కలిసి మడికొండ నుండి ట్రాలీ ఆటో లో వెళుతున్నారు. జనం నుండి వస్తున్న స్పందనకు ఇదే ఉదాహరణ అంటున్నారు కోమటిరెడ్డి.

సభ ముగిశాక వరంగల్‌ నుంచి రోడ్డుమార్గాన హైదరాబాద్‌ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు రాహుల్‌గాంధీ నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై వివిధ అంశాలను చర్చించనున్నారు. శనివారం సాయంత్రం రెండ్రోజుల పర్యటన ముగిశాక రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Chandra Babu: బొజ్జల మరణం అత్యంత బాధాకరం

Exit mobile version