NTV Telugu Site icon

Rahul Gandhi: ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అందించండి.. రాహుల్ తో.. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అందించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా నగరంలోని పలు ప్రజాసంఘాలతో రాహుల్ గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్‌లతో రాహుల్ గాంధీ సమావేశమై వారి ఇబ్బందులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ బాయ్‌తో మాట్లాడుతూ.. వారి దినచర్య ఎలా ఉన్నాయి? ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అడిగి తెలుసుకున్నారు.. వారి సమస్యలను, ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ తమ సమస్యను పరిష్కరించాలని రాహుల్ గాంధీని కోరారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నామని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఈబాధలు తప్పడం లేదంటూ వాపోయారు.

Read also: Mahesh Babu: పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు కానీ క్రేజ్ మాత్రం ఆ రేంజ్ లోనే ఉంటది

కస్టమర్‌లు ఎలా సమస్యలను సృష్టిస్తారో కూడా వారు చెప్పుకుని బాధపడ్డారు. దానికితోడు పెట్రోల్ ధరను కంపెనీ చెల్లించడం లేదని, ఆఖరి నిమిషంలో వినియోగదారుడు రద్దు చేసుకుంటే ఆ భారం వారిపైనే పడుతుందన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అందించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ విషయంపై దృష్టి సారించి రాజస్థాన్‌లో చేసిన విధంగా సంక్షేమ చర్యలు చేపడతామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు తమకు పింఛన్‌ లేదని వాపోయారు. ఐదు గంటలలోగా థంబ్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని చెప్పాడు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారు. వారి దినచర్య ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు.
SSMB 30: రాజమౌళి తర్వాత డైరెక్టర్ ఫిక్స్?

Show comments