ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన రాహుల్.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు, కానీ జన బలం లేదని విమర్శించారు.
ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరాటం ఉండబోతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మరోసారి.. పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని, ఎంత సీనియర్లైనా ఎంత రాజకీయ చరిత్ర ఉన్నవారికైనా ఇది వర్తిస్తుందని రాహుల్ కాంగ్రెస్ నేతలకు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశానికి రాహుల్, రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ సహా 300 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు.
