Radisson Drugs Case: డ్రగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. పెరుగుతున్న నిందితుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radisson Drugs Case: రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు తన స్టేట్ మెంట్ ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల ముందుకు వస్తానని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. షూటింగ్ బిజీలో ఉన్నందున ఇప్పటి వరకు రాలేకపోయానని దర్యాప్తు అధికారులకు చెప్పారు. ఈ రోజైన గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరవుతాడా? లేదా? అనేదాని పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో శ్వేత, లిసి, నీల్, సందీప్ లు పరారీలో వున్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేసారు. డ్రగ్స్ సరఫరా గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీ అరెస్టు చేశారు అధికారులు. అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ అదుపులో తీసుకున్నారు. మిర్జా వాహిద్ డ్రగ్స ఎక్కడి నుండి తెస్తున్నాడో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. మిర్జా వాహిద్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 14 మందిని నిందితులుగా పోలీసులు చేర్చడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది.
Read also: BRS KTR: రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి..? కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన, డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నారని అన్నారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపాడు. వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించాడు. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని తెలిపాడు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్ ను పోలీసులు గుర్తించారు.
Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!