Rachakonda Police Bust International Drugs Racket In Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒక నైజీరియన్‌తో పాటు మరో నిందితుడ్ని పట్టుకున్నారు. నిందితుల నుండి 30 గ్రాముల ఎండీఎంఏ, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. మరో కేసులోనూ అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయ్యింది. రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా.. పోలీసులు ఆ ముఠాని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 45 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో భారీఎత్తున డ్రగ్స్ దందా కొనసాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు.. దీనిని అరికట్టేందుకు ఆపరేషన్లు చేపట్టారు. డ్రగ్స్ దందా చేస్తున్నవారిని పట్టుకుంటున్నారు. ఆల్రెడీ గోవాకు చెందిన ఇద్దరు డ్రగ్ కింగ్‌పిన్‌లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే!
International Drugs Racket: ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
కొన్ని రోజుల క్రితం కూడా మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో.. విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9 కోట్లు విలువ చేసే 8 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు కూడా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు.. ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హైదరాబాద్ మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.
Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..