ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కళ్లకు కట్టినట్టు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. పాల వ్యాన్, ఇతర మార్గాల్లో ఎలా ఎర్రచందనాన్ని సైడ్ చేయొచ్చో తెరపైకి ఎక్కించారు.. ఆ తర్వాత ఈ తరహా స్మగ్లింగ్‌లు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ బయటపడింది.. కొత్త తరహాలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది.. చెన్నైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.. 15 కిలోల మత్తు మందు ఎపిడ్రిన్ స్వాధీనం చేస్తున్నారు.. చెన్నై నుంచి హైదరాబాద్ పెళ్లి వస్త్రాలు తెస్తున్నట్లుగా డ్రామా ఆడుతూ.. పెళ్లి వస్త్రాల మాటున డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తుంది ముఠా.. ఇది పసిగట్టిన రాచకొండ పోలీసులు.. గట్టుగా సాగుతోన్న ఈ వ్యాపారాన్ని రట్టు చేశారు..
Read Also: Central Government: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్.. చెన్నై నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సూడో ఎఫిడ్రీన్ డ్రగ్‌ను పంపిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.. ఇద్దరిని అరెస్ట్ చేసి 8.5 కిలోల సూడో ఎఫిడ్రైన్ స్వాధీనం చేసుకున్నాం.. సీజ్ చేసిన మొత్తం ప్రాపర్టీ విలువ 9 కోట్ల రూపాయలుగా ఉంటుందన్నారు.. మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ ను అరెస్ట్ చేశాం.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. ఫేక్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులతో పట్టుబడ్డారని వెల్లడించారు.. లుంగీలు, ఫాన్సీ ఐటమ్స్ బాక్సుల్లో పార్సల్ చేసి కొరియర్లో బస్సుల్లో రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నారని.. వీటిలో డ్రగ్స్ తయారు చేసే ప్రాంతం.. డ్రగ్స్ నిల్వ ఉంచే ప్రాంతం.. తరలించే ప్రాంతం.. మూడు కీలకంగా ఉన్నాయన్నారు.. హైదరాబాద్ కేవలం డ్రగ్స్ ట్రాన్సిట్ ఏరియా మాత్రమే.. ఈ డ్రగ్ నుంచి మేటాంఫిటమైన్ తయారు చేస్తారని.. రాంరాజ్ ధోతి కోసం వాడే కాటన్ బాక్స్‌లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. ఒక్కో బాక్స్‌లో 80 నుంచి, 90 గ్రాముల ప్యాకెట్ పెడుతున్నారు. ఇలా ఏడు సార్లు పుణె నుంచి, ఎనిమిది సార్లు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయినట్టు గుర్తించినట్టు వెల్లడించారు. ఇలా, ఇప్పటి వరకు 75 కిలోల డ్రగ్స్ దేశం దాటించారని.. ఫరీద్, ఫైసల్.. ఫుణె నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సింథటిక్ డ్రగ్ కేజీకి కోటి ధర ఉండగా, మాటఫెటమినే కేజీ రూ5 కోట్లు విలువ చేస్తుందన్నారు సీపీ మహేష్ భగవత్..