NTV Telugu Site icon

R. Krishnaiah : గ్రూపు-1 పరీక్షల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదు

R Krishnaiah

R Krishnaiah

గ్రూపు-1 పరీక్షల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదని. తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలని. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్-1 వాయిదాపై. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో… బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. గ్రూపు-1 పరీక్షలలో బీసీ, ఎస్సి, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని… రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. జీవో నెంబర్ 29 ఎత్తివేసి ఈ కులాలకు న్యాయం చేయాలని.గత 15రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా లాఠీ చార్జీ చేయడం అన్యాయమన్నారు.

 Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

ఈ పరీక్షల విషయంలో నెలల క్రితమే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని.కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కులాలకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావద్దనే కుట్రతోనే తప్పులను సరి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. జీవో 29 తప్పని దేశమంతా గగ్గోలు పెడుతుంటే… ముఖ్యమంత్రి, అధికారులు వితండవాదం చేస్తూ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 29జీవో రద్దు చేయకపోతే జాతీయ బీసీ కమిషన్, ఎస్సి కమిషన్ కు పిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ట పోకుండా… తప్పులను సరిదిద్ది పరీక్షలు నిర్వహించాలని… లేనిపక్షంలో నిరుద్యోగులు ఆగ్రహానికి గురికాక తప్పందని కృష్ణయ్య హెచ్చరించారు. సాయంత్రంలోపు గ్రూప్-1 పరీక్ష రద్దు చేయకపోతే… రేపు పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని… నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ హెచ్చరించారు.

Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు

Show comments