NTV Telugu Site icon

Hyderabad Rains: హైదరాబాద్‌లో కురుస్తున్న వాన.. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు..

Hydarabad Rains

Hydarabad Rains

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు కాస్త ఊరట లభించింది. ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read also: Mallu Bhatti Vikramarka: అఖిల పక్షంగా ప్రధానిని కలుస్తాం.. కిషన్ రెడ్డి అవకాశం కల్పించాలి..

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చిన్నపాటి వర్షానికే నీరంతా రోడ్లపైకి రావడంతో పలుచోట్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎక్కడా నీరు నిలిచిపోకుండా, డ్రైనేజీ పొంగిపొర్లుతున్న చోట ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీయడంతో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. టోలీచౌక్‌-గోల్కొండ వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Damodar Raja Narasimha: త్వరలో హెల్త్ పాలసీపై ప్రభుత్వం నిర్ణయం..