Damodar Raja Narasimha: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నగరం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు. ఇవ్వాళ ఉస్మానియా మొదటిసారి రావడం జరిగిందన్నారు. ఇవ్వాళ మూడు కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రెనోవేటేడ్ కిచెన్, MRI స్కాన్ పరికరాన్ని , మెడికల్ OP నీ ప్రారంభించామన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి త్వరలో చికిత్స చెయ్యాల్సి ఉందన్నారు. సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సిబ్బంది మెరుగైన సేవలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
త్వరలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యాల్సి ఉందని, ప్రభుత్వంతో చర్చించి త్వరలో ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. త్వరలో ఉస్మానియా ఆస్పత్రి లో నర్సింగ్ కాలేజీ విద్యార్దులకు హాస్టల్ భవనం కట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రేట్స్ రివైస్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
హెల్త్ స్కీమ్స్ కి సంబంధించిన గ్యాప్స్ ఎక్కడ ఉన్నా వాటిని స్ట్రెంతెన్ చేస్తామని తెలిపారు. ఎక్కడ చూసినా ప్రైమరీ హెల్త్ కి సంబంధించిన సౌకర్యాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించబోతున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత అన్ని ఇన్చార్జి పోస్టులే ఉన్నాయి.. వాటిని పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నామని అన్నారు. దొర, దురహకరం ఉండవన్నారు. కొత్త బిల్డింగ్ కట్టడం, కట్టకపోవడం… అనే ప్రశ్న లేదన్నారు. కొత్త సెక్రటేరియట్ కట్టడం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదని, పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే విజన్ ఉండాలన్నారు.
ఉస్మానియా అంటే హైద్రాబాద్ కి షాన్ అన్నారు. అలాంటి ఆస్పత్రి నీ కాపాడుకోవాలన్నారు. టిమ్స్ ఆస్పత్రి మీద ఉన్న సోయి… ఉస్మానియా ఆస్పత్రి లేదు వాళ్ళకన్నారు. ప్రజాపాలన అనేది గుర్తుకు రావాలి.. అహంకారం కాదన్నారు. GNM హాస్టల్ బిల్డింగ్ త్వరలో కట్టిస్తామని శుభవార్త చెప్పారు. పోచారం కాంగ్రెస్ లో చేరికపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పదిస్తూ.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి కి స్వాగతమన్నారు. కాంగ్రెస్ లోకి ఎవ్వరూ వచ్చినా వెల్కమ్ చెప్తామని క్లారిటీ ఇచ్చారు.
Toxic Alcohol: తమిళనాడులో 47కు చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య.. విపక్షాలు ఫైర్