Siblings clash: అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన తమ్ముడు అన్నను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. చివరకు జైలు పాలయ్యాడు. ఈఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Harish Rao: యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు.. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి..
బాగ్యనగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య తీవ్ర కలకలం రేపింది. గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివస్తున్న అస్సాంకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి ఇంటి అద్దె చెల్లించే విషయంలో ఘర్షణకు దిగారు. అన్న అంజన్ బోరాకి, తమ్ముడు రంజన్ బోరాకి మద్య గొడవ తారాస్థాయికి చేరింది. ఇంటి అద్దె విషయంలో నువ్వుంటే నువ్వు అని డబ్బులపై చిన్న మాటల ఒకరిపై మరొకరు దాడి చేసుకునేంతగా వెళ్లాయి. ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదవడంతో తమ్ముడిని చపాతీ కర్రతో అన్న కొట్టారు. దీంతో ఆవేశానికి లోనైన తమ్ముడు రంజన్ బోర అక్కడే వున్న కూరగాయల కత్తితో అన్నను కడుపులో పొడిచాడు. అన్నను కత్తితో అతికిరాతకంగా పొడివడంతో అంజన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఒకతల్లికి పుట్టిన సొంత అన్ననే అనేది కూడా మరిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు తమ్మడు. కత్తితో పొడవడంతో.. అన్న అంజన్, తమ్ముడు రంజన్ ని చూస్తూనే కన్ను మూశాడు. అయితే స్థానికులు ఈఘటనపై పోలీసులకు సమచారం అందించండంతో పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న అంజన్ బోరా మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తమ్ముడి రంజన్ బోరాని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
