కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షచూపుతోందని టీఆర్‌ఎస్ మంత్రులు అంటున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలుపై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారని ఆయన హెచ్చరించారు. ధాన్యం సేకరణ పై మోడీ, కేంద్రం స్పందించకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన వెల్లడించారు. ఆహారపు అలవాట్ల గురించి పీయూష్ గోయల్ మాట్లాడతారు అని ఆయన మండిపడ్డారు.
ఉగాది తర్వాత నూక ఎవరో.. పొట్టోవరో తేలుతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణను ఇబ్బంది పెడుతున్నాం అని కేంద్రం అనుకుటుందేమో.. అది శునకానందం మాత్రమేనని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం ధాన్యం కొంటున్నట్లుగా.. తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉందని, అది కేంద్రమంత్రులు గుర్తుంచుకోవాలన్నారు.
