Minister Puvvada Ajay: ఆసరా పింఛను పథకం బీఆర్ఎస్ దా? కాంగ్రెస్ పార్టీదా? అని ప్రశ్నించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 15 వ తేదీన అందరూ బీ ఫాంలు అందుకున్న తర్వాత సమావేశంలో పాల్గొంటున్నామని తెలిపారు. గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారని తెలిపారు. 2014, 18 ఎన్నికల లాగా కాకుండా ఇప్పుడు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం కొనసాగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు, మేధావులు అంతా సీఎంగా కేసిఆర్ మూడవసారి విజయం సాధిస్తారు అని ఇప్పటికే వెల్లడించారని స్పస్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సీట్లు గెలిచి బహుమతిగా ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసు, ప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన అవుతున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని, అభివృద్ది వైపే నిలవాలన్నారు. ఇతర జిల్లాలతో పాటు ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కెసిఆర్ఖ మ్మం జిల్లాకు పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొదటి సారి 63, రెండవసారి 84 సీట్లు సీఎం కేసీఆర్ కి అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మా కార్యక్రమాలను, హామీలను కాపీ కొట్టింది. మేము కాపీ కొట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఇచ్చిన పించన్ వందల్లోనే ఇచ్చింది.. దాన్ని వేలరూపంలో మార్చింది సీఎం కేసిఆర్ ప్రభుత్వమన్నారు.
కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టిందని మండిపడ్డారు. కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన చెప్పిందే చేస్తారన్నారు. మనం కూడా మన కుటుంబ సభ్యులకు భీమా చేపించం కానీ కేసిఆర్ భీమా అని పెట్టీన సీఎం కెసిఆర్ కు రాష్ట్ర ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. మంచి ఉంది అంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము తీసుకుంటాం మంచిని మేము విమర్శించమన్నారు. మీరు మేనిఫెస్టో లో ప్రవేశపెట్టిన వాటిని మీరు నెరవేర్చలేదు మేము వాటిని నెరవేర్చామని స్పష్టత ఇచ్చారు. చిన్న రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సీఎం కెసిఆర్ మూడవసారి విజయం అందించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనా ఉందని అన్నారు. మా అభ్యర్థులు అందరినీ కారు గుర్తుపై ఓట్ వేసి గెలిపించాలని కోరారు.
Anil Kumar Yadav: మగాళ్లయితే నేరుగా రండి.. ఆడాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కాదు..!