Puvvada Ajay Kumar: పొంగులేటికి పువ్వాడ సవాల్.. దమ్ముంటే రాజీనామా చెయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar Challenges Ponguleti Srinivas Reddy: తన అనుచరుల్ని కాదని, దమ్ముంటే తనని సస్పెండ్ చేయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. దమ్ముంటే పొంగులేటి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేయండని చెప్పిన ఆయన.. వ్యక్తులపై బీఆర్ఎస్ పార్టీ ఆధారపడదని కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాలు పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయన్నారు. వైరాలో అభ్యర్థులు ఉండగానే.. మరో అభ్యర్థిని ఎలా ప్రకటిస్తావంటూ నిలదీశారు. వైరాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తన బాధ్యత అని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ వరకు అభివృద్ధి పనులు కొనసాగాయని.. జనవరి ఒకటో తారీఖు నుంచి అభివృద్ధి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు.
Turkey Earthquake: సందట్లో సడేమియా.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు పరార్..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గాలే వీస్తుందని, జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తుందని పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండా వదిలేస్తే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుందని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ బీఫామ్ తీసుకొని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ఇలాంటి ఉడత ఊపులకు భయపడే మనిషి కాదన్నారు. కేసీఆర్‌కు నమ్మకంగా ఉన్నవాళ్లే బీఆర్ఎస్ ఉండాలని, లేకపోతే పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోండని అన్నారు. కేసీఆర్‌కి తాను చెప్పే వచ్చినవైరా నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత తనదే అని తెలిపారు. వైరా మున్సిపాలిటీకి విశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మేము పెట్టిన కూడే కదా, తినండి, ఎన్ని రోజులు ఆ పదవుల్లో ఉంటారో ఉండండని ఎద్దేవా చేశారు.
Revanth Reddy: తెలంగాణ సంపదని కాలగర్భంలో కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
కాగా.. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాబు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ పార్టీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించారని.. వాళ్ల గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారని.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన బొమ్మ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. తన అనుచరుల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు.
Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!