Site icon NTV Telugu

Puvvada Ajay Kumar : నాపై కుట్రలు చేస్తున్నారు..

తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సాయి గణేష్‌ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. శుక్రవారం ఆయన వైరాలో కమ్మ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరిగింది చిన్నవిషయమే అయినా.. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంతి వర్గం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

అయితే పువ్వాడ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు పువ్వాడ అజయ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నాయి. అంతేకాకుంగా ఈ రోజు తెలంగాణ హైకోర్టు సాయి గణేష్ ఆత్మహత్యపై వివరణ ఇవ్వాలని మంత్రి పువ్వాడతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది.

Exit mobile version