Hyderabad: హైదరాబాద్ లో నయా దందా నడుస్తోంది. సెలూన్ ముసుగులో నీచమైన పని చేస్తున్నారు. కస్టమర్లను ప్రలోభపెట్టి ఉద్యోగుల ముసుగులో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్పా, థెరపీ, సెలూన్ సెంటర్లలో ఇది ఎక్కువగా జరుగుతోంది. పోలీసులకు సమాచారం వెళ్లగా.. దాడులు చేయడంతో ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటిదాకా మొత్తం మూడో కంటికి తెలియకుండా సాగిపోతోందని సమాచారం తెలియడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మహిళలు, యువతులను అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
సౌత్ జోన్ ట్యాంక్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఫర్ట్యూన్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. యువతులను బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనికి కారణమైన రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు.. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్ తో పాటు లాడ్జి యజమానిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా కోల్‌కతా, ముంబైకి చెందిన మహిళలుగా గుర్తించారు. విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మియాపూర్ లో స్పా సెంటర్ సీవైబీ ఏహెచ్ టీయూపై దాడి చేసి నలుగురు యువకులు, ఏడుగురు మహిళలను అదుపులో తీసుకున్నారు.
Shoaib Malik : సానియాతో విడాకులు..హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్