Shoaib Malik : సానియాతో విడాకులు..హీరోయిన్ ను మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గతేడాది ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు సానియా పోస్ట్ లు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు.
Read Also:PM Modi: రెండో రోజు తమిళనాడులో ప్రధాని పర్యటన.. శ్రీరంగం, రామేశ్వరంకు మోడీ..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
అయితే ఈ వార్తల పట్ల ఇంత వరకూ ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలా మంది ఇరువురూ విడాకులు తీసుకున్నారని కన్ ఫాం అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకింత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్.. అది మా వ్యక్తిగత విషయం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించాడు.
Read Also:Rajasthan : అత్యాచారం కారణంగా ప్రెగ్నెంటైన బాలిక.. అబార్షన్ కు అనుమతివ్వని కోర్టు
ఇటీవల సానియా కూడా తన భర్త ఫోటో లేకుండానే ఫొటోల్ని షేర్ చేస్తోంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా, సానియా మీర్జా–పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు దుబాయ్‌లో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను శనివారం సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
సనా జావేద్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటీ. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లు. సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. ‘ఏ ముష్త్-ఎ-ఖాన్’, ‘డంక్’ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. వీరిద్దరు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరూ వీడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!