NTV Telugu Site icon

Asaduddin Owaisi: రాజాసింగ్ అరెస్ట్ అయ్యాడు.. నిరసనలు వద్దంటూ ఓవైసీ పిలుపు

Asaduddin Owaisi 2

Asaduddin Owaisi 2

బీజేపీ నేత రాజా సింగ్‌ను రెండోసారి అరెస్టు చేసారని, శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్‌ ప్రకారమే రాజాసింగ్‌ అరెస్ట్‌ చేశారని ఒవైసీ పేర్కొన్నారు కావున ముస్లీం ప్రజలు ప్రశాంతంగా మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.

రాజాసింగ్‌ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు బీజేపీ వల్ల ప్రశాంతంగా ఉన్న నగరం అశాంతి నెలకొందని ఆరోపించారు. రాజా సింగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజా సింగ్ భవిషత్ లో ఇలాంటి వాక్యలు చేయకుండా ఉండాలంటే అతని పై కేసు లు నమోదు చేసి జైల్ పంపాలని డిమాండ్‌ చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సిగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వాఖ్యలు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందించి రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

నేడు శుక్రవారం దృష్ట్యా.. ఎటువంటి అల్లర్లకు తావులేకుండా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న నమోదైన కేసుల్లో భాగంగా.. గురువారం ఉదయం షాహినాయత్, మంగళ్‌హట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో మంగళ్‌హట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజా సింగ్ అరెస్ట్ తరుణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజా సింగ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండటం వల్లే.. రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒక ఎమ్మెల్యేపై తెలంగాణ చరిత్రలో పీడీ యాక్ట్ నమోదు కావడం.. ఇదే మొదటిసారి.
Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?