NTV Telugu Site icon

Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

Telanganarains

Telanganarains

Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుతుండగా, ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం కనిపించడం లేదు. చాలా చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. దీంతో పలుచోట్ల నీటి మధ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రవాహం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. వాగు ఎక్కడ పొంగి ప్రవహిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎటు చూసిన నీరే.. చిన్న కాలువ నుంచి పెద్ద వాగు వరకు.. అంతా నీరే. కాల్వలు, వాగులు పొంగిపొర్లుతుండటంతో రహదారులు స్థంబించిపోయాయి.

ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతం ఉగ్రరూపంలో ప్రవేశిస్తుంది. రెండు రోజులుగా ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతంలోకి అత్యధికంగా వరదనీరు చేరడంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం ప్రవహిస్తున్నడంతో పర్యటకులను బోగత జలపాతానికి అనుమతించడం లేదు .. పర్యటకులు ప్రమాద బారిన పడకుండా ఉండేందుకే ముందస్తుగా ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం దగ్గరికి పర్యటకులను అనుమతించడం లేదంటున్నారు అధికారులు.

Read also: Holidays: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు..

మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరింది..

* ఇన్ ఫ్లో : 64,000 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో : 35000 క్యూసెక్కులు
* పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు
* ప్రస్తుత నీటి సామర్థ్యం: 315.970 మీటర్లు
* పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 TMC
* ప్రస్తుత నీటి నిల్వ : 5.134 TMC.. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

భద్రాద్రి వర్షాలతో సింగరేణి బొగ్గుగనుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి లలో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. పెద్ద వాగు ప్రాజెక్ట్ కు గండితో వృధాగా పోతున్న నీళ్లు.. 16000 ఎకరాలకు సాగు నీరు సమస్య ఏర్పడింది. తెలంగాణలో 2500 ఎకరాలు సాగు , ఆంధ్ర లో 13500 ఎకరాలకు సాగు నీరు లేనట్లే అని పించింది. పెద్ద వాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు 300 కోట్లు అవసరమంటున్నారు అధికారులు. రెండు రాష్ట్రాలు నిధుల కేటాయింపుకు అనుమానమే అంటున్నారు అధికారులు.

Read also: Astrology: జులై 20, శనివారం దినఫలాలు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో కుండపోత వర్షం కురుస్తున్నారు. తుంగవారి కాలనీ వద్ద ఉప్పువాగు ఉదృతిగా ప్రవహిస్తుండటంతో రోడ్డుపైకి వరద పొటెత్తింది.
కందుకూరు -దిద్దుపూడి గ్రామాలకు రాకపోకలు నిలిచారు. తుంగవారి కాలనీకి వరద చుట్టు ముట్టింది. ఇళ్ళలో నుండి బయటికి రాకుండా బిక్కు బిక్కు అంటూ ఉంటున్న కాలనీ వాసులు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రాజెక్టులకు బేతుపల్లి ప్రాజెక్టు, అలుగు పోస్తూన్న లంకా సాగర్.. 8.6 అడుగులకు చేరుకున్న వైరా ప్రాజెక్టు. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులు.ప్రస్తుత నీటి మట్టం 16.06 అడుగులకు చెరుకుంది. దీంతో ప్రాజెక్టు నుండి ఆరు అంగుళాలకు పైగా అలుగు పారుతుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులు..ప్రస్తుతం నీటి మట్టం 16.7 అడుగులకు చేరుకొని అలుగు పారుతుంది. బేతుపల్లి చెరువు నుండి NTR కెనాల్ ద్వారా 250 క్యూసెక్స్ సాగు నీరు విడుదల. సత్తుపల్లి నియోజకవర్గం లో ని బేతుపల్లి,లంకాసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చెరుకొని జలకళ సంతరించుకుంది. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతర్గత రహాదారులపై మొకాళ్ళ లోతు వరద ప్రవహం పెరిగింది. చల్లనీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో చలికి గజ గజ వణుకుతున్న జనం.. స్థంబించిన జన జీవనం.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షం.

కొమరంభీం జిల్లాలో ప్రాణహిత ఉదృతి పెరిగింది. ఎగువ మహరాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉదృతంగా ప్రవహిస్తుంది. వర్షాలతో అప్రమత్తంగా వుండాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి అలెర్ట్ గా వుండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read also: Tragedy: విషాదం.. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి

నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో..

* కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు,7.603 టీఎంసీలు.

* ప్రస్తుత నీటిమట్టం 689.700 అడుగులు, 5.201 టిఎంసిలు- ఇన్ ఫ్లో 2899 క్యూ సె.

కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో దిందా వాగు ఉప్పొంగుతుంది. రెండవ రోజు దిందా గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. కాగజ్‌ నగర్‌, సిర్పూర్. కౌటల,బెజ్జూర్‌,చింతల మానేపల్లి, దహెగాం మండలాల్లో రాత్రి‌ నుండి‌ వర్షం కురుస్తుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి వరద పోటు.. బ్యారేజ్ లో పూర్తిగా 85 గేట్లు ఎత్తి‌వేశారు అధికారులు. ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 3,73,500 క్యూసెక్కులు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
Tragedy: విషాదం.. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి