Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Professor Haragopal Fires On Cm Kcr

Professor Haragopal: ఉద్యోగాలు లేవు.. విద్యా విధానాన్ని ధ్వంసం చేశారు

Published Date :October 10, 2022 , 4:49 pm
By NTV WebDesk
Professor Haragopal: ఉద్యోగాలు లేవు.. విద్యా విధానాన్ని ధ్వంసం చేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Professor Haragopal Fires On CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని.. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన సాగుతోందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడుతారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని, రూ. 5 భోజనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు కూడా.. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాల విషయంలోనూ ప్రభుత్వ విధానాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఆ నేరాలను కంట్రోల్ చేయకుండా నేరం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుందని అనుకున్నామని.. కానీ అత్యాచారాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించిన ఆయన.. పాత చట్టాలు ఉంటే రాష్ట్రం ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • professor haragopal
  • Pubs In Telangana
  • Telangana Drugs Case
  • Telangana Education System

తాజావార్తలు

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions