NTV Telugu Site icon

Ghanta Chakrapani: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలొచ్చాయి..

Ghanta Chakrapani

Ghanta Chakrapani

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మాజీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి… బీఆర్ అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.. ఇక, దేశంలో ఏ యూనివర్సిటీకి లేని ఆదరణ అంబేద్కర్‌ యూనివర్సిటీకి వచ్చిందన్నారు. పోటీ పరీక్షల్లో విజయానికి కేరాఫ్ అడ్రస్ గా అంబేద్కర్‌ వర్సిటీ స్టడీ మెటీరియల్ నిలిచింది.. కేవలం.. యూనివర్సిటీకే పరిమితమైన ఈ మెటీరియల్‌ను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు.. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించబడిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

Read : JP Nadda – Nithin meet: జేపీ నడ్డాతో నితిన్‌ భేటీ.. ఇలా స్పందించిన బీజేపీ నేత

ఏ రాష్ట్రంలో నియామకాలు జరగని విధంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ తెలంగాణలో జరిగిందని తెలిపారు గంటా చక్రపాణి.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగానే అన్ని జిల్లాల్లో 25 సెంటర్స్ ని ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేసిన ఆయన.. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ తో విజయవంతంగా సివిల్ సర్వీస్, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు పొందిన వారు ఎందరో ఉన్నారు.. వారి అనుభవాలను నేను స్వయంగా విన్నానని తెలిపారు. ఎంతోమంది అనుభవజ్ఞులతో పుస్తకాలు రాయించి మార్కెట్లోకి తెస్తున్నాం.. యుద్ద ప్రాతిపదికన ఈ పుస్తకాలు 3 నెలల్లో పూర్తి చేశాము.. కేవలం ప్రింటింగ్ కాస్ట్ తో 4 పుస్తకాలు 11 వందల రూపాయలకు అందుబాటులో తెచ్చామని వెల్లడించారు ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి.

Show comments