NTV Telugu Site icon

President Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Murmu Kcr

Murmu Kcr

President Droupadi Murmu: హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకిముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ముర్ము చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఉత్సవాల్లో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్తారు.

Read also: Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన బ్యాగ్..

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్‌కుంట ప్రాంతాల్లో వెహికిల్స్ కు పర్మిషన్ లేదని వెల్లడించారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. బొల్లారం, అల్వాల్, లోత్‌కుంట, త్రిముల్‌ఘేరి, కార్ఖానా, జేబీఎస్‌, ప్లాజా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్ రూట్లలో వచ్చే వాహనాలను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్‌పీఎస్‌ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు.
Modi Govt Cabinet Expansion: ఎన్నికల రాష్ట్రాలపై కేంద్రం దృష్టి.. కేబినెట్ విస్తరణకు రెడీ అయిన బ్లూ ప్రింట్