NTV Telugu Site icon

20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గు చేటు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభకు హాజరైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికార టీఆర్‌ఎస్‌ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి టీఆర్ఎస్ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొర్లు, బర్లు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కులవృత్తులకు పరిమితం చేస్తున్నందుకా, టీఆర్‌ఎస్‌ విజయోత్సవాలు నిర్వహించేది ఎందుకని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు.

వందలాది మంది విద్యార్థి అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో నియంతృత్వం పెరిగి పోయిందన్నారు. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ కటౌట్ల ఏర్పాటు చేశారని, ఎవరికి జరిమానా విధించారో కేటీఆర్‌ చెప్పాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు.