Power Cuts in Hyderabad: హైదరాబాద్ వాసులకు విద్యుత్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో నేటి నుంచి కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ఈ కరెంటు కోతల వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. నేటి (17) నుంచి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్లను పరిశీలించి అవసరమైతే కొత్తవి వేస్తామని ముషారఫ్ తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, రోజూ కాదని, ఒక్కో ఫీడర్‌కు ఒక రోజు మాత్రమేనని తెలిపారు.
Read also: JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల బేసి ఫీడర్లు ఉన్నాయని.. నేటి (జనవరి 17) నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు (ఆదివారాలు & పండుగలు మినహా) 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేసి నిర్వహణ పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లోనే కరెంటు కోతలు ఉంటాయన్నారు. విద్యుత్తు అంతరాయాలకు సంబంధించిన వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవని బీఆర్ఎస్ విమర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ చీకటి రోజులు వస్తాయని హెచ్చరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ విద్యుత్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. విద్యుత్ సంస్థలు దాదాపు 80,000 కోట్ల మేర నష్టపోతున్నాయని BRS ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ పేరుతో కరెంటు కోతలకు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
Prabhas: అనౌన్స్మెంట్ లుక్ లోకి వచ్చేసాడు… పార్ట్ 2 మొదలుపెడుతున్నారా?