తెలంగాణలో గతంలో కంటే ఈసారి మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఫీక్ డిమాండ్ ను అధిగమించాయి విద్యుత్ సంస్థలు. ఇవాళ మధ్యాహ్నం 2.57 నిమిషాలకు 13742 మెగా వాట్స్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకూ ఇదే రాష్ట్రంలో ఏర్పడిన అత్యధిక డిమాండ్.
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. గత సంవత్సరం మార్చి 31న 13688 మెగా వాట్స్ అత్యధిక డిమాండ్ నమోదు అయింది. కాగా గత రికార్డ్స్ తిరుగరాస్తూ ఈసారి ఏకంగా 13742 మెగా వాట్స్ డిమాండ్ నమోదు కావడం విశేషం.గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సైతం భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో ,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ లో 55 మిలియన్ యూనిట్స్ దాటింది. కానీ ఈసారి విద్యుత్ వినియోగం మార్చిలోనే 65 మిలియన్ యూనిట్స్ డిమాండ్ పెరిగింది. గత సంవత్సరం మార్చి 31న 13688 మెగా వాట్ల పీక్ డిమాండ్ నమోదయింది. ఇవాళ ఏకంగా 13742 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు కావడంపై అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం 14500 మెగావాట్స్ ఫీక్ డిమాండ్ నమోదు అయ్యే అవకాశం వుందంటున్నారు అధికారులు. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 15,000 మెగా వాట్స్ డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.
