CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దల సమక్షంలో తెలంగాణకు రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
తెలంగాణలో గతంలో కంటే ఈసారి మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఫీక్ డిమాండ్ ను అధిగమించాయి విద్యుత్ సంస్థలు. ఇవాళ మధ్యాహ్నం 2.57 నిమిషాలకు 13742 మెగా వాట్స్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకూ ఇదే రాష్ట్రంలో ఏర్పడిన అత్యధిక డిమాండ్. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. గత…
రాష్ట్ర విభజన సరిగా సాగకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని శాఖల మధ్య వివాదాలు రాజుకుంటూనే వున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలో జీపీఎఫ్ వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ. 2900 కోట్లు వుందన్నారు. ఇటీవల ఏపీలోని…