Site icon NTV Telugu

Ponnam Prabhakar: బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య హాజరయ్యారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఐతే కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలనీ బీర్ల ఐలయ్య కోరారని తెలిపారు.

Read also: Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

దానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఐపోగానే ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ, బీసీలకు వ్యతిరేక పార్టీ.. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమే అన్నారు. అందుకే ఉత్తర భారత దేశం గ్రహించి బిజెపికి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. పాంచ్ న్యాయ్ అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీజేపీ రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుందన్నారు. బీజేపీ రిజర్వేషన్ లను టచ్ చేస్తే.. తొక్కలు తీస్తామన్నారు. బీజేపీ నేతలు నిన్నటి నుండి రిజర్వేషన్లు తీయం అంటున్నారని తెలిపారు.

Read also: Kalpana Soren: గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు కల్పనా సోరెన్ నామినేషన్

కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్నారు. కురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది కాంగ్రెసే అని తెలిపారు. Nsui లో నాతో పాటు స్టేట్ బాడీ లో కురుమ యువకులు వున్నారని తెలిపారు. యాదవ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యుడిగా పంపిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కురుమలకు రావాలని కోరుకుంటున్నా అని తెలిపారు.

Read also: PM Modi: అమిత్ షా ఫేక్ వీడియోలు వైరల్.. ప్రధాని మోడీ సీరియస్..!

కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కొల్లూరు మల్లప్ప ఫొటోను గాంధీ భవన్లో పెట్టడం సంతోషమన్నారు. HPCC గా కొల్లూరు మల్లప్ప పనిచేశారన్నారు. కేసీఆర్, మోడీ గొల్లకురుమలను మోసం చేసిందన్నారు. గోర్లు బర్లు అని కేసీఆర్ మోసం చేసిండని తెలిపారు. 17 సీట్లల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గొల్లకురుమలు పనిచేయాలన్నారు. మోడీ బీసీఅని చెప్పుకుంటడు.. కానీ రిజర్వేషన్లను ఎత్తేస్తా అంటుండు అని మండిపడ్డారు. కాంగ్రెస్ గొల్లకురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చిందన్నారు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటై బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. గుడిలో దేవుడు ఉండాలి, భక్తి మనసులో ఉండాలన్నారు. మతాలు,కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండు మోడీ అని తెలిపారు. మరోసారి మోడీ వస్తే.. దేశప్రజలు ఆగమే అన్నారు. సరితకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్తానం ఇస్తారన్నారు.

Read also: Heat wave Warning: తెలుగు రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. కానీ అనివార్యకారణాల వల్ల రాలేకపోయాయని తెలిపారు. బీసీలో కురుమ సంఖ్య పెద్దదే అన్నారు. కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు. గద్వాలలో సరితకు అవకాశం ఇచ్చింది పార్టీ.. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల ఓటమిపాలయ్యిందన్నారు. సరితా గెలిస్తే కురుమలకు మరింత బలం అయ్యేదన్నారు. బీర్ల ఐలయ్య గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచిండన్నారు. కార్పొరేషన్ పదవులు కూడా రావాలి కురుమలకు అని తెలిపారు. కురుమ కులానికో చెందిన కొల్లూరు మల్లప్ప.. మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ కు పీసీసీ చీఫ్ గా పనిచేశారన్నారు. ఐలయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసి కురుమలకు పార్టీలు ప్రభుత్వంలో మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు.
Tamannaah Bhatia : సారీ రాలేను.. నాకు టైం కావాలి.. సైబర్ సెల్ ను కోరిన తమన్నా

Exit mobile version