NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఎస్సీ , ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ , ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తో గీతా కార్మికునీ బిడ్డగా తెలంగాణ మంత్రిగా అయ్య అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావుని గెలిపించండి.. వారిని ఆశీర్వదించాలన్నారు. మన వాళ్ళకి సమస్య వస్తె మా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రావద్దు అని చెప్పిన అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు మీరు నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు..మీకు ఎప్పటికీ మీ బిడ్డగా ఉంటా అని తెలిపారు.

Read also: Sanjiv Goenka-KL Rahul: కెమెరాల ముందే అరుస్తారా.. ఇది సిగ్గుపడాల్సిన విషయం!

రాజకీయ ,ఉపాధి ,ఆర్థికంగా మీ అందరికీ సహకరిస్తా అన్నారు. వేములవాడ లో మీ అందరి సహకారంతో స్టార్ హోటల్ లాంటి వసతి గృహం నిర్మిస్తున్నామన్నారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న హుస్నాబాద్ కి అందరూ వచ్చారు..కష్టపడ్డారు..ఎమ్మెల్యే అయ్యాను..జిల్లా మంత్రి అయ్యానన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా ఒక్క తాటి మీద రాజేందర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచినం అని తెలిపారు. బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సి ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. రాజేందర్ రావు గెలిస్తే నేను గెలిచినట్టన్నారు. మంగలి షాపులు బ్యూటి పార్లర్ అయినాయి..కల్లు కాంపౌండ్ లు బార్ లు కావాలన్నారు. సామాజిక ,రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కి ఇంకా బలం కావాలంటే మీ అందరి మద్దతు కావాలని తెలిపారు. నా బలం మరింత పెరగాలంటే రాజేందర్ రావు గారిని గెలిపించండన్నారు.

Read also: Aravind Kejriwal : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. జూన్ 2న హాజరు కావాలని ఆదేశాలు

మీ అందరికీ రెండు చేతులు జోడించి ఆశీర్వదించాలని కోరుతున్న అని అన్నారు. రాజేందర్ రావు గెలుపు మా అందరి గెలుపన్నారు. రాజేందర్ రావు తండ్రి జగపతి రావు మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేశారన్నారు. నిన్న బండి సంజయ్ మాట్లాడుతున్నారు… రాజకీయ గురువు చొక్కరావు నో ఓడించిన జగపతి రావు గారి కుమారుడు కి మద్దతుగా నిలబడ్డారు అని అంటున్నారని మండిపడ్డారు. జగపతి రావు తెలంగాణ ఉద్యమ కారుడు..ఆయన కుమారుడు రాజేందర్ రావు గారు కూడా ఉద్యమ కారుడే ఆయనేం చొక్కరావు గారి మీద పోటీ చేయడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అమరవీరులకు పార్లమెంట్ లో అవమానకరంగా మాట్లాడితే కనీసం స్పందించని బండి సంజయ్ ను ఎన్నికల్లో ఓడించాలన్నారు.
Chiranjeevi : పిఠాపురం ప్రచారంపై స్పందించిన మెగాస్టార్..