Ponnam Prabhakar: మైండ్ సెట్ మార్చుకోండి.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి పొన్నం కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు.. మైండ్ సెట్ మార్చుకోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసి ఉద్యోగులు ధర్నా చేస్తా బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. 21 మంది అటో డ్రైవర్ లు ఆత్మ హత్యలు చేసుకున్నారు అని సభను తప్పు దారి పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణం వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫూడల్స్ ఇవాళ ఆటోలలో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను అవమానిస్తున్నారని తెలిపారు. ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారని, మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళను పట్టించుకోలేదు వాళ్ళు అని మండిపడ్డారు. ఆటో వాళ్ళ గురించి మట్లాడుతున్నారు… చాలన్ పేరుతో ఆటో వాళ్ళను వేధించింది మీరు అని గుర్తు చేశారు. బస్సు దగ్గరికి ఆటో లోనే వచ్చేదని, మహిళలకు ఉచిత బస్సు వద్దా చెప్పండి? అని ప్రశ్నించారు. బెంజ్ కార్లో తిరిగే మీరు ఇప్పుడు ఆటో ఎక్కారూ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూడల్స్ మీరు.. ఇప్పుడు ఆటో ఎక్కారు అంటూ మండిపడ్డారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టొద్దు.. ఆత్మహత్యలకు ప్రోత్సహించెట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సొమ్ము అంతా వరంగల్ లో ఒకరు.. కరీంనగర్ లో ఒకరు.. ఆర్ముర్ లో ఒకరు అనుభవిస్తున్నారని, ఇప్పుడు మట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారని తెలిపారు.
Also Read
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
- Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
Read also: Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ..
బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మ హత్యలు లేకుండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వెస్తం అన్నారు…రెండు లక్షల ఋణ మాఫీ ఓకే సారి చేస్తాం అన్నారు.. ఏమైంది ? అని ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదన్నారు. రైతు భరోసా ఎందుకు ఇస్థలేరు? అని ప్రశ్నించారు. బెదిరిస్తున్నరు.. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రుల తాపత్రయం పడుతున్నారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి..
అధాని నీ వద్దు అనుకుంటే…సిఎం ఒప్పందాలు చేసుకుని వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్నట్టే అధని పెట్టుబడులు వద్దన్నారు.
అదాని వస్తె తెలంగాణ ప్రగతి ఆగిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాలి…నిధుల కోసం డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో లోపయికారి ఒప్పందం చేసుకుంటే తెలంగాణ సమాజం సహించదన్నారు. కేసీఅర్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మేము తిట్టడం లేదు.. తెలంగాణ ఎలా వచ్చింది చెబుతున్నామన్నారు. మార్పు…మార్పు అంటున్నారు.. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అని ప్రశ్నించారు.
Virat Kohli: నేను చెప్పిందంతా అబద్ధం.. విరాట్ విషయంలో డివిలియర్స్ యూటర్న్!
తాజావార్తలు
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
-
BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!