Ponnam Prabhakar : వర్షాల కారణంగా రింగ్ రోడ్డులోపల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఇతర పెద్ద సమస్యలు లేవని తెలిపారు. ఏ విభాగమైనా సరే సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆకస్మిక వర్షం, అక్రమ నిర్మాణాలు, ఓపెన్ నాళాల్లో చెత్త వేయడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో హైడ్రా వాహనాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరి చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎండాకాలంలో నీటి కొరతను ఎదుర్కొంటూనే, వర్షాకాలంలో నీటిని భూమిలోకి చొప్పించుకునే అవకాశాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి, చెత్తను నాళాల్లో వేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఒక్క రోజులో సమస్యలు పరిష్కారం కావడం సాధ్యం కాదని, కానీ ప్రజలు సహకరిస్తే త్వరగా సమస్యలు తగ్గుతాయని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజలతో పాటు మీడియా కూడా ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ఆయన కోరారు.
70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ
