Ponnam Prabhakar: కనీసం నీకు హిందీ ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావుకు మద్దతుగా రాజీవ్ చౌక్ లో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటికీ అమలు కానీ 4000 పింఛన్ రేషన్ కార్డులు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఇంతకుముందున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ చేసింది ఏమిటి? అని ప్రశ్నించారు.
Read also: Patang: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పతంగ్ అందరి మనసులకు హత్తుకుంటుంది..
భార్య పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన బండి సంజయ్ కి వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అవినీతికి పాల్పడటం వల్లే అధ్యక్ష పదవ నుంచి తొలగించారన్నారు. నీకంటే ముందు ఒక గ్రాడ్యుయేటెడ్ గా పార్లమెంటులో అడుగుపెట్టిన అన్నారు. కనీసం నీకు హిందీ, ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందన్నారు. వేల కోట్లు సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్న బండి సంజయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కు మద్దతుగా నిన్న పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తామన్నాము ఇచ్చిన మాట ప్రకారం 5 నెర వేర్చామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
Read also: Narendra Modi: వాయనాడ్‌లో ఓటమి భయంతో రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ
బీజేపీ పార్టీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంటులో నేను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ నాయన టీచర్ అంటున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడని చెబుతున్నాడని వ్యంగాస్త్రం వేశారు. ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని అన్నారు.
Patang: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పతంగ్ అందరి మనసులకు హత్తుకుంటుంది..