NTV Telugu Site icon

Ponnam Prabhakar : భవిష్యత్‌లో స్థానిక సంస్థలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం

Ponnam

Ponnam

కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 2024 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపిపి లకు శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులున్నా ,లేకున్నా అనేకా కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొనీ మంచి పేరు సంపాదించుకున్నారని, జడ్పీటిసి సభ్యునిగా మీ పదవి ముగిసినప్పటికీ ప్రజా జీవితంలో మీరు మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎన్నికై ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నా అని మంత్రి పొన్నం అన్నారు.

అంతేకాకుండా..’నేను గతంలో కొత్తగా సింగిల్ విండో అధ్యక్షుడు అయిన తరువాత పెద్దల ఆశీర్వాదం తో సహకార రంగంలో విజయవంతంగా పని చేశా.. కరీంనగర్ జిల్లా పరిషత్ కు మా రాజకీయ గురువు చొక్కారావు గారు గతంలో చైర్మన్ గా అయ్యారు… తరువాత చాలా మంది ఎన్నికయ్యారు.. ప్రజా సమస్యలు పరిష్కరించిన వాటికి సంతృప్తిగా తీపి గుర్తుగా ఉంటాయి.. కొన్ని పరిష్కారం కానివి ఉన్న వాటిని మళ్ళీ పరిష్కారం దిశగా పదవుల్లో ఉన్నా లేకున్నా అవి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్ లో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.. పదవుల్లో ఉన్నన్ని రోజులు రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ,అరోగ్యకైరమైన వాతావరణం లో పని చేశాం.. రాబోయే కాలంలో మీకు మరింత మంచి జరగాలని , భవిష్యత్ లో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్న.. పదవి పూర్తి చేసుకున్న జడ్పీటిసి లకు శుభాకాంక్షలు తెలుపుతున్న.. రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాం.. ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చు.. మీరంతా భవిష్యత్ లో మరిన్ని పదవులు సాధించవచ్చు.. ప్రజా జీవితంలో మరింతగా ముందుకు పోతుండాలని కోరుకుంటున్న..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.