Site icon NTV Telugu

Ponnala On Mallanna Sagar: మల్లన్నసాగర్ కేసీఆర్ కుటుంబానికి అంకితం

కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి.

ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు. సాంకేతికంగా ఎత్తి పోతల పథకాల రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువగా ఉంటుంది.కానీ మల్లన్న సాగర్ 50 టీఎంసీ లతో సాంకేతికతకు తిలోదకాలు ఇచ్చారు. మైదాన ప్రాంతంలో కట్టిన రిజర్వాయర్ భవిష్యత్తు లో ప్రమాదం వాటిల్లితే.. జరిగే నష్టం ఊహించలేం. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ సముద్రం పాలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకపోతే కోర్టు లలో కేసులు ఎందుకు పడ్డాయి..?

గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేది ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేశామనే .. ఇప్పటి వరకు ఎల్లంపల్లిని జాతికి అంకితం చేయడం లేదని పొన్నాల విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేసేటట్లయితే.. 2013 చట్టానికి ఎందుకు తూట్లు పొడిచావని ప్రశ్నించారు.

https://ntvtelugu.com/errabelli-dayakar-rao-fired-on-bandi-bjp/
Exit mobile version