Ponguleti Sudhakar Reddy: ఇపుడు మొదలైంది ఆట అంటున్నారు.. రకరకాల వెన్నుపోట్లు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మకై ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. ఇపుడు మొదలైంది ఆట అంటున్నారని, వెన్నుపోట్లు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని సూచించారు. నాలుగైదు సార్లు నాకు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. దానివల్లనే నిఖారసైన కాంగ్రెస్ కార్యకర్తనైన నేను బీజేపీలో చేరా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏనాడు ఉద్యమాలలో పాల్గొని లాఠి దెబ్బలు తిన్నావాళ్ళు కాదు వీళ్లు ఇవ్వాల తెలంగాణా గురించిమాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రేస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ వేసినట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: New Delhi: వీర్యం తారుమారులో రూ. 1.50 కోట్ల జరిమానా
కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మవద్దని తెలిపారు. కొంతమంది ఏ రకంగా సంపాదించారో తెలియాదా మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులను ఆదుకున్న దాఖలాలు లేవని, వారికుటుంబాలకు న్యాయం చేయని మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. కొంత మంది విదేశి శక్తులతో కలిసి నరేంద్ర మోడీని ఓడగొట్టాలి అని చూస్తే అది మీ వల్ల కాదని అన్నారు. ఒక పార్టీలో ఉంటే కమిట్ మెంట్ తో ఉండాలని సూచించారు. కాశ్మీర్ లో ఈ రోజు రాహుల్ గాంధీ జెండా ఎగర వేశారంటే అది నరేంద్ర మోడీ వల్లనే కాదా? అని ప్రశ్నించారు. మా కార్యకర్తలను బ్లేం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర లో జరుగుతుందని మండిపడ్డారు. పార్టీ ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అని అన్నారు. ఖమ్మంలో పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తా అని తెలిపారు.
Viral Video: బాయ్ ఫ్రెండ్ ఉంటే మాత్రం దారుణంగా కొట్టేస్తారా?