Ponguleti Srinivas Reddy : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి భద్రత, భరోసా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పాలనలో స్పష్టమైన తేడా ఉందని, మొన్నటి ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు.
ఈ ప్రసంగంలో మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని, రాబోయే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ క్యాబినెట్ ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు మాట తప్పే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా చెప్పారు.
Eggs Prices: ఆకాశాన్ని అంటుతున్న ‘‘కోడిగుడ్డు’’ ధరలు.. కారణాలు ఏంటి?, ఎప్పుడు తగ్గుతాయి?
పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందని, ఇది పేద కుటుంబాల్లో ఎంతో సంతోషాన్ని నింపిందని మంత్రి తెలిపారు. దీనితో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చిత్తశుద్ధితో పేదవాడి గడప వరకు చేరుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆడపిల్లలకు కాస్మెటిక్ చార్జీలను 200 శాతం, మగపిల్లలకు డైట్ చార్జీలను 40 శాతం మేర పెంచామని తెలిపారు. పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. చివరగా, తనకు మద్దతుగా నిలిచిన ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Minister Ramprasad Reddy: జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..
