Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponguleti Srinivas Reddy Guidelines To New Collectors Telangana

Ponguleti Srinivas Reddy : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి.. కొత్త కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

Published Date :March 3, 2026 , 3:40 pm
By Gogikar Sai Krishna
  • కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం
  • సంక్షేమ పథకాల అమలులో అంకితభావం అవసరం
  • ప్రజలే కేంద్రంగా పాలన సాగించాలని దిశానిర్దేశం
  • అభివృద్ధి–సంక్షేమానికి సమతౌల్యం పాటించాలన్న సూచన
Ponguleti Srinivas Reddy : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి.. కొత్త కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన పలు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాల పాలన, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వారికి కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

మంత్రిని కలిసిన వారిలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఐఏఎస్ అధికారుల కెరీర్‌లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయడమే అత్యంత కీలకమైన అవకాశం. ఈ సమయంలో ప్రజలతో నేరుగా మమేకమైతే క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన వస్తుంది. ఈ అనుభవమే మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి గుర్తు చేశారు. ఈ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం , అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజాపాలనలో ‘ప్రజలే కేంద్రంగా’ పాలన సాగాలని మంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. “ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటూనే, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. అధికార యంత్రాంగం అంతా ఒక టీమ్‌లా కలిసి పనిచేసి, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆయన చెప్పారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపై పట్టు సాధించాలని ఆయన అధికారులకు సూచించారు.

China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ponguleti Srinivas Reddy
  • Telangana Collectors
  • Telangana governance
  • welfare schemes

తాజావార్తలు

  • Ponguleti Srinivas Reddy : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి.. కొత్త కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

  • Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం ప్రారంభం.. ఏ సమయంలో.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..

  • Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..

  • Raptee HV: 1 గంటలో 80% ఛార్జ్, 200KM రేంజ్.. హై-వోల్టేజ్ బైక్ రాప్టీ హెచ్ వీ డెలివరీలు స్టార్ట్

  • BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions