Site icon NTV Telugu

TS Congress: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. ఈ నెల 22న రాహుల్ గాంధీతో భేటీ

Kupalli Poguleti

Kupalli Poguleti

TS Congress: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనేది కూడా తేలిపోయింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు ఈ నెల 22న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. సభ అనంతరం పలువురు నేతలు తెలంగాణలోని ప్రత్యేక బహిరంగ సభల్లో కాంగ్రెస్‌కు సన్మానం చేయనున్నారు. ఈ నెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

Read also: Delhi Metro: జానీ జానీ ఎస్‌ పాపా.. మేకింగ్‌ రీల్స్‌ ఇన్‌ మెట్రో నో పాపా..!

ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకటరావు, బానోత్ విజయబాయి, కోట రాంబాబు, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారె ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్ హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే మహబూబ్ నగర్ బహిరంగ సభలో జూపల్లి అండ్ టీం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. జూపల్లితో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Delhi Metro: జానీ జానీ ఎస్‌ పాపా.. మేకింగ్‌ రీల్స్‌ ఇన్‌ మెట్రో నో పాపా..!

Exit mobile version