NTV Telugu Site icon

Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదన్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా ? అంటూ ప్రశ్నించారు. బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం వాస్తవం కాదా ? అన్నారు. దీనిపై రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మాట్లాడితే బాగుండేదని ఎద్దేవ చేశారు. అయ్యప్ప మాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘనందన్‌ రావు. రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల తీసిన తర్వాత అన్నింటికీ సమాధానం చెబుతా! అంటూ తెలిపారు. రఘునందన్ రావు అక్రమంగా సంపాదించి ఉంటే.. అధికారంలో ఉన్న మీరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు.

Read also: Ice Cream Delivery Boy: ఐస్‌క్రీమ్‌ డెలివరీ బాయ్‌ అకృత్యం.. మహిళలే టార్గెట్‌.. లైంగికదాడులు, లక్షలు వసూలు..

పఠాన్ చెరువు పరిశ్రమల్లో నేను డబ్బు వసూలు చేస్తే ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇన్నాళ్లు ఎందుకు విచారణ చేయడం లేదు ? అని మండిపడ్డారు. రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నా ఆస్తులను ప్రకటిస్తా? మీ ఆస్తులను ప్రకటిస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. రోహిత్ రెడ్డికి ప్రగతి భవన్ ఆశీస్సులు తప్ప సొంత బలం లేదని ఎద్దేవ చేశారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక.. తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలుచేశారు. ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తులను ప్రకటిస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. నేను ఆస్తులను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న, దుబ్బాక నియోజకవర్గం.. సిద్దిపేట, గజ్వేల్ తో పోటీ పడుతుందని రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Show comments