Site icon NTV Telugu

Hyderabad Pubs: బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..

Bachupalli Pub

Bachupalli Pub

Hyderabad Pubs: బాచుపల్లి పియస్ పరిదిలోని టకీల పబ్ పై బాచుపల్లి పోలీసుల రైడ్ చేశారు. అనుమతి లేకుండా డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల వెల్లడించారు. కేవలం బార్ పర్మిషన్ తో టకీల పబ్ నిర్వహణపై అధికారులు సీరియస్ అయ్యారు. టకీల పబ్ లోని మ్యూజికల్ ఎక్విఫ్మెంట్ తో పాటు 2ల్యాప్ టాప్ ల సీజ చేశారు. టకీల పబ్‌ పై కేసు నమోదు చేశారు. బార్ పర్మిషన్ తీసుకుని డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. బార్‌ పర్మిషన్‌ తీసుకున్న యజమాని ఎవరని ప్రశ్నించారు? బార్‌ అని బోర్డు పెట్టి లోపల పబ్‌ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎవరైనా సరే చేపడితే సహించేది లేదని తెలిపారు. ఎంతటి వారైనా కఠిచర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి కైనా సిటీలోని పబ్‌ యాజమాన్యం తీరు మార్చుకోవాలని సూచించారు.

Read also: Israel-Hamas: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ

తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్‌లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు. అనంతరం.. పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బార్లు, పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Cyclone Dana: తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు

Exit mobile version